2 May, 2026 | 5:01 PM

ఆర్బీవీఆర్ఆర్ వర్ధంతి వేడుకలు

02-05-2026 03:56 PM

ముకరంపుర,(విజయక్రాంతి): రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 73వ వర్ధంతి సందర్భంగా... శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రం లోని  వారి విగ్రహం వద్ద  వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు  నరహరి జగ్గారెడ్డి, సెక్రటరీ బండ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి లు ముఖ్య అతిథిలుగా హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ... నిజాం కాలం లో హైదరాబాద్ సంస్థానము లో కొత్వాల్ గా పని చేశారని, వారు పదవీ విరమణ అనంతరం  హైద్రాబాద్ లో వసతి గృహం ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు ఎంతగానో కృషి చేశారని... వారి ఆశయాలకనుగుణంగా నే కరీంనగర్ లో ఆర్ బి వి ఆర్  బిఈడి కళాశాల స్థాపించి విద్యార్థులకి విద్యనందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారి ఆశయాల సాధనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.