13 July, 2026 | 1:20 AM

పాత్రికేయుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం

13-07-2026 12:17 AM

శ్రీనివాస్ భౌతికకాయాన్ని సందర్శించి నగదు అందజేసిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం 

బోయినపల్లి జూలై 11 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన పాత్రికేయులు గజ్జల శ్రీనివాస్ శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. గజ్జెల శ్రీనివాస్ గుండెపోటుతో మరణించిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని రాత్రి పది  గంటలకు భౌతిక కాయన్ని  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి, అంత్యక్రియల నిమిత్తం పదివేల (10000/-) రూపాయల ఆర్థిక సహాయం అందించి భవిష్యత్తులో వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మన బోయిన సువిన్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, సర్పంచ్ లు నల్లమోహన్, ఏనుగుల కనకయ్య, కాంగ్రెస్ నాయకులు పెంచాల మహేష్,వన్నెల రమణారెడ్డి, సంభ లక్ష్మీ రాజం, కొప్పుల నగేష్, తదితరులు ఉన్నారు.