12 June, 2026 | 2:18 AM

ఓఆర్‌ఆర్‌పై రాంకీ లారీ దగ్ధం

12-06-2026 12:59 AM
  1. ఎండ తీవ్రతకు వాహనంలో చెలరేగిన మంటలు
  2. దుండిగల్ పీఎస్ పరిధిలో ఘటన

కుత్బుల్లాపూర్, జూన్ 11 (విజయక్రాంతి): ఓఆర్‌ఆర్‌పై లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాంకీ కంపెనీకి చెందిన ప్రమాదకర వ్యర్థాలను తీసుకెళ్తున్న లారీ పటా న్‌చెరు నుంచి దుండిగల్ వైపు వెళ్తుండుగా, ఎండ తీవ్రత కారణంగా మంటలు అంటుకొని దగ్ధమైంది. గమనించిన రాంకీ కంపెనీ ఫైర్ సిబ్బంది స్పందించి ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.