7 August, 2026 | 10:27 PM

సహ చట్టం సాధన కమిటీ మండల అధ్యక్షులుగా మార్కపురి శివప్రసాద్

07-08-2026 09:21 PM

ఉత్తర్వులు జారీ జాతీయ ఛైర్మెన్ డాక్టర్ చంటి ముదిరాజ్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం సాధన కమిటీ భూపాలపల్లి మండల అధ్యక్షులుగా మార్కపురి శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ ఛైర్మెన్ డాక్టర్ చంటి ముదిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో మండల అధ్యక్షులుగా నియమించిన జాతీయ ఛైర్మెన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతిలతో పాటు తన నియామకానికి సహకరించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు తోట సురేష్, జిల్లా కన్వీనర్ కాసాని దేవేందర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతను నిస్వార్థంగా నిర్వర్తిస్తూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, జిల్లా కమిటీల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.