7 August, 2026 | 10:07 PM

గరిడెపల్లి న్యూ జనరేషన్ స్కూల్‌లో కనుల పండుగలా బోనాల వేడుకలు

07-08-2026 09:34 PM

* గ్రామ దేవతల వేషధారణలో విద్యార్థులు

గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను గరిడెపల్లిలోని న్యూ జనరేషన్ స్కూల్‌ లో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినుల తలపై అందంగా అలంకరించిన బోనాలు,పోతురాజుల వేషధారణలు, శివసత్తుల నృత్యాలు, డప్పుల దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పాఠశాల ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అవుల నరసింహరావు మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. పాఠశాలల్లో సాంప్రదాయ పండుగలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి పట్ల అవగాహన, గౌరవ భావం పెంపొందుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. సుజాత, సుధారాణి, శ్రీలత, స్వప్న, శిల్ప, స్వాతి, అనూష, లక్ష్మి, హలీమ, ఉపేంద్ర, మనీషా, సిబ్బంది నరేందర్, నవనీత, రాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.