7 August, 2026 | 10:26 PM

ఆగస్టు 10 జైల్ భరో, రాస్తారోఖో కార్యక్రమాలను విజయవంతం చేయాలి

07-08-2026 09:19 PM

బోధన్,(విజయక్రాంతి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్ భరో, రాస్తారోఖో కార్యక్రమాలను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బోధన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు బి. మల్లేష్, జే. శంకర్ గౌడ్, పి. వరదయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ

నాలుగు లేబర్ కోడ్ల రద్దు, కార్మికులకు జీవన వేతనాలు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్, రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సీహెచ్ రమేష్, టీయూసీఐ నాయకులు చాందు, దయాల్ సింగ్, ఎంసీపీఐయూ నాయకులు మోసిన్ తదితరులు పాల్గొన్నారు.