సమస్యలు వింటున్న ఎమ్మెల్యే కలెక్టర్
ఆదివాసి గూడెంల అభివృద్ధికి కృషి
బుల్లెట్ బండి పై వెళ్లి సమస్యలు విన్న ఎమ్మెల్యే కలెక్టర్
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల ఆదివాసి గూడాలను తండాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా గురువారం సందర్శించారు. కోరు కంటి పొలం కూడా చాకిరాల మిద్దె చింతల అల్లంపల్లి చాకిరేవు కోరుకంటి తండా తదితర గిరిజనగుడాలను బుల్లెట్ బండి పై రాళ్లు రప్పల మధ్య వెళ్లారు.
ప్రభుత్వ ద్వారా మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆదివాసి గిరిజన తండాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.
తాగునీరు విద్య రవాణా సౌకర్యం ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను తక్షణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై గ్రామాల్లో అడిగి తెలుసుకున్నాయన ప్రభుత్వ పథకాలను సద్వినియోగించుకోవాలని సూచించారు. చాలా గ్రామాల్లో గిరిజనులు అటవీ శాఖ అధికారులు తమను వేధిస్తున్నారని కలెక్టర్ ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు.
వంట కర్ర తెచ్చుకోవడం లేదని ఇందిర ఇండ్లకు ఇసుక సైతం అడ్డుకుంటున్నారని ప్రభుత్వం పథకాలు మంజూరు చేసిన అనుమతి లేదని పథకాలను అమలు కాకుండా అటవీ శాఖ అధికారులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టిలో ఉందని తప్పకుండా న్యాయం జరుగుతుందని వారు గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డిఎఫ్ ఓ సుఖదేవ్ సుశాంత్ వెంకటేశ్వర్లు డి ఆర్ డి ఓ విజయలక్ష్మి డిపిఓ శ్రీనివాస్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ స్థానిక అధికారులు ఉన్నారు.






