7 August, 2026 | 10:27 PM

బీరంగూడలో యువకుడిపై కత్తులతో దాడి

07-08-2026 09:32 PM

అమీన్ పూర్: అమీన్‌పూర్‌ సర్కిల్‌ పరిధిలోని బీరంగూడ శ్రీరామ్‌నగర్‌ కాలనీలో యువకుడిపై కత్తులతో దాడి ఘటన కలకలం రేపింది. మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన బండారి అరవింద్‌పై సుమారు పది మంది వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై అమీన్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు కొంతమందిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్ట్‌ చేయాలని అఖిల భారత వడ్డెర సంఘం నాయకులు పోలీసులను కోరారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించామని అమీన్‌పూర్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. అఖిల భారత వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు తిరుమల దేవి, ఆల్‌ ఇండియా ఉపాధ్యక్షుడు వేముల దశరథ్, ప్రధాన కార్యదర్శి వరికుప్పల శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ వేముల మధుసూదన్, నాంపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు వల్లపు మల్లికార్జున్ తదితరులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.