మెడికవర్‌లో తల్లి, కవలలకు ప్రాణదానం
అత్యంత క్లిష్టమైన గర్భధారణ కేసును విజయవంతంగా నిర్వహించిన వైద్యులు
హైదరాబాద్, జూన్ 11(విజయక్రాంతి): నాందేడ్‌కు చెందిన 31 ఏళ్ల వై. అల్కా నాగభూషణ్ ఎదుర్కొన్న అరుదైన అత్యంత ప్రమాదకరమైన గర్భధారణ కేసును మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి, తల్లి,కవల శిశువుల ప్రాణాలను కాపాడారు. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్‌తో పాటు అదుపులో లేని గర్భధారణ మధుమేహం వంటి సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి, 32 వారాల గర్భధా రణలో అత్యవసర సిజేరియన్ ద్వారా కవల శిశువులను సురక్షితంగా ప్రసవింపజేశారు. వై. అల్కా నాగభూషణ్ సుమారు 30 వారా ల కవల గర్భిణిగా ఉన్న సమయంలో అ క్యూట్ ప్యాంక్రియాటైటిస్‌తో ఆస్పత్రిలో చేరారు.
ఇది ప్రతి వెయ్యి నుంచి ఐదువేలు గర్భధారణల్లో ఒకదానిలో మాత్రమే కనిపించే అరుదైన వ్యాధి. దీనికి తోడు అదు పులో లేని గర్భధారణ మధుమేహం ఉండటంతో తల్లి, శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్ర మాదం నెలకొంది. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రసూతి అండ్ గైనకాలజీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, ఎండోక్రినాలజీ, అనస్థీషియా, నియోనటాలజీ విభా గాల నిపుణులు సమన్వయంతో చికిత్స అం దించారు.
నిరంతర పర్యవేక్షణలో భ్రూణాల ఆరోగ్య పరిస్థితిలో మార్పులు గుర్తించిన వైద్యులు 32 వారాల వద్ద అత్యవసర సిజేరియన్ నిర్వహించారు. ప్రసవం అనంతరం కవల శిశువులను ప్రత్యేక చికిత్స కోసం ఎన్‌ఐసీయూలో చేర్పించారు. అత్యాధునిక వైద్య సేవలు, నిరంతర పర్యవేక్షణతో శిశువులు కోలుకోగా, తల్లితో కలిసి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ప్రసూతి అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ షాలిని నారాయణ మాట్లాడుతూ, ఇది అత్యంత క్లిష్టమైన కవల గర్భధారణ కేసు. సరైన సమయంలో పర్యవేక్షణ, నిపుణుల సమన్వయంతో తల్లి, శిశువులను సుర క్షితంగా కాపాడగలిగాం అన్నారు.జనరల్ మెడిసిన్ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ శ్రావణి రెడ్డి కరుమూరు మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అరుదుగా కనిపించినా ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది.
త్వరితగతిన ని ర్ధారణ చేసి సరైన చికిత్స అందించడం వల్ల సంక్లిష్టతలను నివారించగలిగాం అని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ అనస్థీషియాలజి స్ట్ డాక్టర్ గౌరీ శంకర్ అత్యవసర సిజేరియన్ సమయంలో సురక్షిత అనస్థీషియా సేవలు అందించి, శస్త్రచికిత్స విజయవంతం కావడం లో కీలక పాత్ర పోషించారు.మెడికవర్ ఉమె న్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ నియోనటాలజీ అండ్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డా. రవీందర్ రెడ్డి పరిగే మాట్లాడుతూ, అకాల ప్రస వంతో జన్మించిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం. అత్యాధునిక ఎన్‌ఐసీ యూ సేవలతో ఇద్దరు శిశువులు పూర్తిగా కోలుకుని తల్లితో కలిసి ఇంటికి వెళ్లగలిగారు అన్నారు.






