7 August, 2026 | 10:26 PM

మనూలో సివిల్స్‌కు ఉచిత శిక్షణ

07-08-2026 09:17 PM

- మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశం

- ఆగస్టు 12తో దరఖాస్తుల గడువు ముగింపు

- తెలంగాణ మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా

కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): 2027లో జరగనున్న యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ  వారు అందిస్తున్న ఉచిత సివిల్స్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

కార్పొరేట్ స్థాయికి ధీటుగా జాతీయ స్థాయిలో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు గాను ఒక ఏడాది పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణను విశ్వవిద్యాలయం అందిస్తుందని, ఆసక్తి గల అభ్యర్థులు తమ 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ , పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో ఆగస్టు 12వ తేదీలోగా https://manuu.gleamappstore.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 16న నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని పేర్కొంటూ, అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కొరకు 8520860785 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.