విజయ హై స్కూల్ లో రక్షాబంధన్ వేడుకలు
27-08-2026 06:42 PM
నిర్మల్,(విజయక్రాంతి): మంజులాపూర్‌లోని విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి, నిర్వాహకులు అయ్యగారు భూమయ్య విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.






