కొండ కుటుంబం బీసీలకు కొండంత అండ
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు భవనంలో జిల్లా అధ్యక్షుడు నల్గొండ మహేందర్ పటేల్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పోగుల సారంగపాణి హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ కులాలకు కొండా మురళి, కొండా సురేఖ కుటుంబం ఎల్లప్పుడూ కొండంత అండగా నిలుస్తుందని తెలిపారు. బీసీ, పేద, బలహీన వర్గాల సంక్షేమం కోసం కొండకుటుంబం చేసిన సేవలు మరువలేనివన్నారు.
మంత్రి కొండా సురేఖకు పార్టీ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన నోటీసులనువెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఒకవేళ మంత్రి పదవి నుంచి తొలగిస్తే మున్నూరు కాపుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంఘాలన్నీ కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.






