27 August, 2026 | 9:32 PM

రాంజీగూడ ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

27-08-2026 07:12 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కేరమేరి మండలం రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఈ నజీమోద్దీన్‌తో కలిసి పాఠశాల భవనం, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, భోజనం, వసతి, ఆరోగ్య సదుపాయాలపై ఉపాధ్యాయులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.