27 August, 2026 | 8:14 PM

కేరళ గ్లోబల్ హై స్కూల్లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

27-08-2026 06:43 PM

రుద్రంగి ఆగష్టు27(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక కేరళ గ్లోబల్ హై స్కూల్లో పాఠశాల యజమాన్యం ఆధ్వర్యంలో శనివారం రోజున ముందస్తు రక్షాబంధన్ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బాబు నంబియర్  పాఠశాల ప్రిన్సిపాల్ లతీకలు మాట్లాడుతూ.. రాఖీ పండగ విశిష్టత గురించి సోదరా సోదరి బంధాల గురించి విద్యార్థులకు ఈ సందర్భంగా  తెలియజేశారు.

విద్యార్థులు ఒకరికొకరు రక్షాబంధన్ కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు,అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..