27 August, 2026 | 8:18 PM

మహంకాళి ఆలయ ఉపాధ్యక్షులను సన్మానం చేసిన ఎమ్మెల్యే

27-08-2026 07:05 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గుండ్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పులబోయినా రవి లను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడుతూ, అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని అయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, నాయకులు డిష్ రాజు, ఐడియా మహేష్ తదితరులు పాల్గొన్నారు.