27 August, 2026 | 8:18 PM

వాసవి వరల్డ్ స్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్

27-08-2026 07:07 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్‌లోని వాసవి వరల్డ్ స్కూల్లో సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధం, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.  విద్యార్థులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని “ప్రేమ – నమ్మకం – రక్షణ” అనే రక్షాబంధన్ సందేశాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ  జగదీష్ రెడ్డి, కరెస్పాండంట్ పోత రెడ్డి, ప్రిన్సిపాల్ శైల జాయ్ సన్, ఉపాధ్యాయులు మరియు  విద్యార్థులు  పాల్గొన్నారు.