28 August, 2026 | 12:35 AM

సమకాలీనం వ్యాస సంపుటి ఆవిష్కరణ

27-08-2026 07:14 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): తెలుగు భాషా సంరక్షణ సంఘం- విఎన్‌ఆర్‌ ఫౌండేషన్, శాతవాహన లయన్స్ క్లబ్ , లీడ్ ఇండియా ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో లయన్‌ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన “సమకాలీనం” వ్యాస సంపుటిని ఆవిష్కరించి ముఖ అతిథిగా హాజరైన ప్రొఫెసర్ అనిశెట్టి రవీంద్రనాథ్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ విసీ మాట్లాడుతూ విద్యతో పాటు ఆర్థిక అక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అయిన డిజిటల్‌ యుగంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.

సభాధ్యక్షత వహించిన ఆల్ఫోర్స్‌ విద్యా సంస్థ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అనుకున్నది సాధించడానికి పేదరికం అడ్డుకాదని, చాలా మంది పేద యువత సునాయాసంగా ఉన్నత స్థానాలకు ఎదిగారని చెప్పారు.తెలుగు భాషా సంరక్షణ సంఘం అధ్యక్షులు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ సమకాలీనం వ్యాస సంపుటిలో 130 వ్యాసాలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు.కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మాట్లాడుతూ మనం ఎంచుకున్న విద్యలో ప్రథమ స్థానం సాధించడానికి నిరంతరం సాధన చేయాలని హితవు పలికారు. పుస్తక రచయిత డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యువ భారతం, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రాపంచిక అంశాలు, భారతీయ సమాజ సమస్యలతో కూడిన పలు వ్యాసాలు ఉన్నాయని తెలిపారు.