28 August, 2026 | 4:28 AM

ఓటర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

27-08-2026 07:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియలో ఓటర్ల సమస్యలను పరిష్కరించి సమగ్ర ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని పంచశీల్ కాలేజీలో గాజుల్పేట్  జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్వో (BLO)లు నిర్వహించిన బిఎల్ఏ (BLA), బిఎల్వోల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాయింట్ సెక్రటరీ, తెలంగాణ సయ్యద్ హైదర్, డిప్యూటీ తహసీల్దార్ (డిటి) శేఖర్ తో కలిసి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని విన్నవించారు. నోటీసులు జారీ చేసిన అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే అర్హులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.