రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో మనోజ్‌కు రజతం
ఎర్రవల్లి, ఆగస్టు 27: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం లో గల శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్‌ఈ పాఠశాల విద్యార్థి టి. మనోజ్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రజత పతకం సాధించాడు. హనుమకొండ జెఎన్‌ఎస్ స్టేడియంలో ఆగస్టు 26, 27 తేదీల్లో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-14 విభాగంలో మనోజ్ ద్వితీయ స్థానం సాధించాడు.
ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల డైరెక్టర్ వీర శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్ వీర గోవర్ధన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శివకుమార్ అభినందించారు. మనోజ్ విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్‌కుమార్, అశోక్, రమేష్‌లను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. భవిష్యత్తులో మనోజ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.






