మెడల్ పాఠశాలలో రక్షాబంధన్
28-08-2026 12:44 AM
సదాశివనగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో రక్షాబంధన్ ఉత్సవాన్ని గురువారం నిర్వహించారు.ఇందులో విద్యార్థులు విద్యార్థినులు, విద్యార్థులకు రాఖీ కట్టి ప్రతి ఒక్కరం ఒకరికొకరు రక్షణగా ఉండాలని ఆకాంక్షిచారు. ప్రతి అమ్మాయి పట్ల ఎలాంటి చెడు దృష్టి లేకుండా తమ అక్క చెల్లెలు లాగా భావించుకోవాలని కోరుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






