నంచర్లలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
28-08-2026 12:46 AM
మహమ్మదాబాద్,(విజయక్రాంతి): నంచర్ల గ్రామంలోని ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్, అంగన్‌వాడీ కేంద్రాల్లో విశ్వహిందూ పరిషత్ సహకారంతో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదరభావం, దేశభక్తి, ఐక్యతను చాటుకున్నారు. జీహెచ్‌ఎం సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రేమ, ఆప్యాయతతో మెలుగుతూ పెద్దలను గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవి, ఉపాధ్యాయులు, వీఎచ్‌పీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






