5 March, 2026 | 6:43 PM

మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

05-03-2026 04:45 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పరిధి తాతపాపన్ పల్లి లో బుధవారం రాత్రి కొందరు దుండగులు మహాత్మా గాంధీ(Mahatma Gandhi statue ) విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. భారతదేశ బానిస సంకెళ్లను అహింసా పరమ ధర్మః అని సిద్ధాంతంలో బ్రిటిష్ వారి నుండి స్వతంత్రాన్ని సాధించిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ. ఆ మహానుభావుని విగ్రహాన్ని విచక్షణ రహితంగా కొందరు దుండగులు ధ్వంసం చేయడం విషాదకరం. వారు ఎవరన్నది ఇంకా తెలియ రాలేదు దుండగులను తక్షణమే సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించి 8పట్టుకోవాల్సిందిగా ఆర్యవైశ్య సంఘం నాయకులు తూప్రాన్ ఎస్సై జ్యోతి కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

దినసరి కార్మికులకు కూలి రేట్లు పెంచాలి

ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు

రాజ్యసభ ఎన్నికలు.. రాష్ట్రంలో 3 నామినేషన్లు దాఖలు