గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్
ముంబైతో రాజస్థాన్ చావోరేవో
ముంబై, మే 23 : ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ నేటితో ముగియబోతోంది. ఇప్పటి వరకూ మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యా యి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుకోగా.. మిగిలిన బెర్త్ కోసం మూ డు జట్లు పోటీలో నిలిచాయి. ఈ రేసులో అందరికంటే ముందున్న రాజస్థాన్ రాయ ల్స్ ముంబై ఇండియన్స్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్త్ వారి చేతుల్లోనే ఉంది. ముంబైని ఓడిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
ఒకవేళ ఓడిపోతే మాత్రం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఉం టుంది. అయితే ఆ జట్ల కంటే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడం రాజస్థాన్‌కు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం రాజస్థాన్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఈ గెలుపుతోనే ప్లే ఆఫ్ రేసులో ముందు నిలిచింది. లక్నో భారీస్కోరు చేసినా రాయ ల్స్ అలవోకగా ఛేదించింది. దీనికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీనే. ఈ చిచ్చర పిడుగు తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. జైస్వాల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాలనిస్తున్నాడు. అలాగే జురెల్, ఫెరీ రా, జడేజా వంటి హిట్టర్లు చివర్లో చెలరేగితే రాజస్థాన్‌కు తిరుగుండదు.
అయితే గత మ్యాచ్‌లో రియాన్ పరాగ్ గాయంతో దూరమవడంతో జైస్వాల్ సారథిగా వ్యవహరిం చాడు. కీలకమైన ముంబైతో మ్యాచ్‌కు పరా గ్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాలి. అటు బౌలింగ్‌లో ఆర్చర్, సందీప్ శర్మతో పాటు బ్రిజేష్ శర్మ, రాజ్ పూనియా కూడా రాణిస్తున్నారు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖేడే పిచ్ పై వీరంతా కలిసికట్టుగా ఎలా రాణిస్తారనేది చూడాలి. మ రోవైపు ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ పరువు కోసం పోరాడుతోంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆ జట్టు సీజన్‌ను విజయంతో ముగించాలని పట్టుదలగా ఉంది.
నిలకడలేని బ్యాటిం గ్‌తోనే ముంబైకి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. గత మ్యాచ్ లో బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో కోల్‌కతా చేతిలో చిత్తు గా ఓడిపోయింది. నిజానికి ఈ సీజన్ లో ముంబై బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. ఒకట్రెండు మ్యాచ్ లలో తప్పిస్తే అంచనాలు పెట్టుకున్న ప్లేయర్స్ ఏమాత్రం రాణించలేదు.ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లలో కేవలం నాలుగే విజయాలు సాధించిన ముంబై పా యింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. రోహిత్ శర్మ, రికెల్టన్ నిలకడలేని ఆటతీరు ఇబ్బందిగా మారింది.
అటు సూర్యకుమార్ యాద వ్, హార్థిక్ పాండ్యా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. తిలక్ వర్మ పర్వాలేదనిపించినా కీలక సమయంలో నిరాశపరుస్తు న్నాడు. బౌలింగ్‌లో బుమ్రా తనపై అంచనా లు అందుకోలేకపోయాడు. శార్థూల్ ఠా కూర్, కార్బిన్ బోస్చ్ కూడా పెద్దగా రాణించడం లేదు. గత రికార్డులను చూస్తే ముం బైదే పైచేయిగా ఉంది. ఇక పిచ్ విషయానికొస్తే మధ్యాహ్నం మ్యాచ్ అయినప్పటకీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా.
తుది జట్ల అంచనా
ముంబై : రికెల్టన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్య కుమార్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్) విల్ జాక్స్ , కార్బిన్ బోస్చ్, దీపక్ చాహర్, బుమ్రా, రఘుశర్మ
రాజస్థాన్ : జైస్వాల్(కెప్టెన్), ప్రిటోరియస్, జురెల్, ఫెరీరా, శుభమ్ దూబే, జడేజా, దసున్ శనక, ఆర్చర్, సందీప్ శర్మ, బ్రిజేశ్ శర్మ, యష్ రాజ్ పూనియా






