24 May, 2026 | 3:08 AM

శతక్కొట్టిన శ్రేయాస్ అయ్యర్

24-05-2026 01:34 AM

పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం

భారీ టార్గెట్‌ను ఛేదించిన పంజాబ్

టాప్ 4లోకి ఎంట్రీ

ఐపీఎల్ 19వ సీజన్ చివరి ప్లే ఆఫ్ బెర్త్ కోసం పోటీ రసవత్తరంగా మారింది. వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. లక్నోను చిత్తు చేసి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. ఆదివారం రాజస్థాన్ చివరి మ్యాచ్‌లో ఓడితే పంజాబ్ ముందంజ వేస్తుంది. 

లక్నో, మే 23 : లక్నో సూపర్ జెయింట్స్‌పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మరో ఆలోచన లేకుండా ఫీ ల్డింగ్ ఎంచుకున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు లక్నో ఈ మ్యాచ్ లో అవకాశమిచ్చింది. భారీ టార్గెట్‌ను ప్రత్యర్థి ముందు ఉంచే లక్ష్యంతో లక్నో కూడా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిం ది. కులకర్ణి డకౌటవగా.. నికోలస్ పూ రన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ దశ లో ఓపెనర్ జోస్ ఇంగ్లీస్, ఆయుశ్ బదోనీ అదరగొట్టారు. బదోనీ 43 పరుగులకు ఔటై నా ఇంగ్లీస్ మా త్రం ధాటిగా ఆ డాడు. 44 బం తుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ (26) పరుగులకు వెనుదిరగ్గా, ముకుల్ చౌదరి(1) కూడా నిరాశపరిచాడు. అయితే అబ్దుల్ సమద్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

అర్జున్ టెండూల్కర్(5) నాటౌట్‌గా నిలవడంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న అర్జున్‌కు నిరాశే మిగిలింది. కేవలం ఐదు బంతులు మాత్రమే ఆ డే అవకాశం దక్కింది. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో అర్జున్ టెండూల్కర్‌కు స్ట్రుకింగ్ ఇచ్చేందుకు అబ్దుల్ సమద్ నిరాకరించాడు. సింగిల్ తీయమని పదే పదే అడిగినా కూడా సమద్ నిరాకరించడం ఆశ్చర్యపరిచింది. పం జాబ్ బౌలర్లలో జెన్సన్ 2, చాహల్ 2 వికెట్లు తీసారు.తర్వాత ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ రెచ్చిపోయింది.

ప్రియాన్ష్ ఆర్య (0), కూపర్ కన్నోలీ(18) నిరాశపరిచారు. అయితే తర్వా త ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వీరవిహారం చేశారు. వీరిద్దరూ కేవలం 76 బంతుల్లోనే 140 పరుగు ల భాగస్వామ్యం నెలకొల్పారు. పభ్ సిమ్రన్ సింగ్ అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  షమీ వేసిన ఓ ఓ వర్లో మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత సెంచరీకి దగ్గరైన శ్రేయాస్ అయ్యర్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేయడమే కాకుండా శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ కిం గ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలోనే 200 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా అర్జున్ టెండూ ల్కర్ బంతితో పర్వాలేదనిపించాడు. 4 ఓవ ర్లు వేసి 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు.  ఈ విజయంతో 15 పాయింట్లతో పంజాబ్ టాప్ 4లోకి దూసుకొచ్చింది. అయితే రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా తమ చివరి మ్యా చ్‌లలో ఓడిపోతే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.  

స్కోరు బోర్డు

లక్నో ఇన్నింగ్స్ : 196/6 ( ఇంగ్లీస్ 72, బదోనీ 43, సమద్ 37 నాటౌట్ ; జెన్సన్ 2/33, చాహల్ 2/25 , ఒమర్జాయ్ 1/29 )

పంజాబ్ ఇన్నింగ్స్ : 200/3 ( శ్రేయాస్ 101 నాటౌట్, ప్రభ్‌సిమ్రన్ 69, కన్నోలీ 18 ; షమీ 2/45, అర్జున్ టెండూల్కర్ 1/36)