15 July, 2026 | 1:18 AM

వర్షపు నీటిని ఒడిసిపట్టాలి

15-07-2026 12:00 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ సోనియా

మొయినాబాద్, జూలై 14 (విజయ క్రాంతి): వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని మొయినాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి షాబాద్ సోనియా దర్శన్ అన్నారు.మంగళవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం ప్రభుత్వ జిల్లా పాఠశాలలో వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి కొరతను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, ప్రభు త్వ కార్యాలయం, విద్యాసంస్థలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ విభాగం అధికారులు, ఈఈ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.