అమీన్ పూర్ లో వర్ష బీభత్సం
23-06-2026 03:05 PM
అమీన్ పూర్ జూన్ 23: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కుండపోత వర్షాల కారణంగా పలు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అర్థరాత్రి కురిసిన భారీ వర్షంతో వీధులు నదులను తలపించాయి.నివాస ప్రాంతాలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో వాహనాలు నీట మునిగాయి.తెల్లవారుజాము నుంచే నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమ్యూనిటీల సహాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో, భారీ వర్షాల వల్ల మురుగునీరు వర్షపు నీటితో కలిసి రోడ్లపై పొంగిపొర్లుతోంది.సహాయక బృందాలు రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల నుంచి నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






