23 June, 2026 | 6:06 PM

నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు

23-06-2026 04:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ నుండి శ్రీ లక్ష్మి నరసింహ పుణ్య క్షేత్రమైన ధర్మపురికి ప్రతి రోజు బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు ప్రతి రోజు నిర్మల్ బస్టాండ్ నుండి ఉదయం 6.45 కు బయలుదేరి  కడం, దస్తురాబాద్, కలమడుగు, బీర్పూర్ ద్వారా  9.15 ని!! లకు చేరుకుంటుందన్నారు. తిరిగి ధర్మపురి నుండి 9.30 ని!! లకు బయలు దేరి అదే మార్గంలోనిర్మల్ కు మ!! 12 గం!! లకు చేరుకుంటుందని, నిర్మల్ పట్టణ, పరిసర  ప్రాంత ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని ఆయన తెలిపారు. నిర్మల్ నుండి ధర్మపురి కి వెళ్లే భక్తులు ఈ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు