డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు
23-06-2026 04:52 PM
షాద్ నగర్,(విజయక్రాంతి): జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా బిజెపి నాయకులు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం,దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ షాద్‌నగర్ ఇంచార్జ్ అందే బాబన్న, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ గుప్తా, వంశీకృష్ణ, ఏసునాతి శ్రీనివాస్, ప్యాట అశోక్, శ్రీనివాసాచారి, మల్చాలం మురళి, చెట్ల వెంకటేష్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.






