ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్
బోథ్, జూన్ 23(విజయక్రాంతి): ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో 23 వేల ప్రభుత్వ పాఠశాలను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తుందని పాఠశాలల ఎత్తివేత ప్రక్రియను వెంటనే ఆపాలని ఏబీవీపీ. జిల్లా నాయకులు బోయిడి ఆకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల. అనేకమంది పేద పిల్లలు నష్టపోతారన్నారు. కార్పొరేట్ పాఠశాల ఆర్థిక దోపిడిని అరి కట్టి ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు నిర్మించాలని పేర్కొనడం జరిగింది ప్రైవేట్ పాఠశాలల్లో బుక్కులు యూనిఫాంలో ఎకరాలు నిషేధించాలన్నారు పలు సమస్యలపై బందుకు పిలుపునివ్వడం జరిగిందని పేర్కొన్నారు తాను ఇచ్చిన పిలుపుమేరకు పాఠశాల లో విద్యార్థులు తరగతులు బహిష్కరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర్ కమిటీ అధ్యక్షులు అభి అఖిల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు






