ఉత్తమ ఆశయాలతో చదువుకోవాలి
డిఐఈఓ జాదవ్ గణేష్
ఉట్నూర్,(విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత ఆశయాలతో చదువుకొని ఉన్నత పదవులు అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి జాదవ్ గణేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి తనిఖీ చేసిన అనంతరం చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. ఈ సంవత్సరం బైపీసీ సెకండ్ ఇయర్ లో మలియ
గోహర్ 967 మార్కులు సాధించగా, ఏరికారి విశ్వేశ్వర్ రావు961 మార్కులు, ఎంపీసీ సెకండ్ ఇయర్ లో దేవులపల్లి శాన్వి 966 మార్కులు,ఆల్యా న నాజ్ 954 మార్కు లు సాధించడం అభినందనీయమన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో కష్టపడి చదువుకున్న విద్యార్థులు మాత్రమే మార్కులు సాధించారని అన్నారు. ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో సైతం ఉత్తమ మార్కులు సాధించి ర్యాంకులు స్వాధీనం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను శాలువాలు కప్పి , బొకే లు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పంద్రా జయవంత్ రావు,పొదిలసుదర్శన్, ప్రిన్సిపాల్ పొదిల అనిత, కళాశాల అధ్యాపకులు, పోషకులు పాల్గొన్నారు.






