23 June, 2026 | 6:08 PM

Instagramలో పోటీ.. కొత్త పథకానికి పేరు చెబితే రూ.లక్ష

23-06-2026 04:31 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మంచి పేరు చెప్పు.. లక్ష పట్టు అంటూ ప్రకటన చేసింది. హైదరాబాద్ క్యూర్(Hyderabad Cure) పరిధిలో లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు కసరత్తు మొదలు పెట్టింది. కొత్త పథకానికి మంచి పేరు సూచించాలని హౌసింగ్ బోర్డు ప్రజలను ఆహ్వానించింది. ఉత్తమ పేరు సూచించిన వారికి హౌసింగ్ బోర్డు రూ. లక్ష బహుమతి ప్రకటించింది. ఈ నెల 28 వరకు పేరు సూచించాలని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ ప్రకటించారు. tghd.official ఇన్ స్ట్రాగ్రామ్, Instagram.com ద్వారా పోటీలో పాల్గొనవచ్చని గౌతమ్ వెల్లడించారు.