23 June, 2026 | 6:08 PM

సుల్తానాబాద్ లో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

23-06-2026 04:43 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప జాతీయవాది, దేశ సమైక్యత కోసం తన ప్రాణాలను అర్పించిన డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ... దేశంలో "ఏక్ దేశ్ – ఏక్ నిషాన్ – ఏక్ విధాన్" సిద్ధాంతం కోసం పోరాడిన మహానీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దుకు ఆయన చేసిన త్యాగం, పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనిపేర్కొన్నారు.దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు ప్రతి భారతీయుడికి ఆదర్శమని, యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలుసాకారమవుతున్నాయని అన్నారు.