23 June, 2026 | 6:08 PM

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎరువుల కొరత లేదు

23-06-2026 04:41 PM

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మకం విశ్వాసంతో పనిచేస్తున్నానని ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడడం నా ప్రధమ కర్తవ్యం గా భావిస్తున్నాను అన్నారు.  మంగళవారం కామారెడ్డి లో విలేకరులతో ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను వ్యవసాయ శాఖ అధికారిక గణంకాల ప్రకారం కామారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా సరఫరా లో గాంధారి మండలం మొదటి స్థానంలో ఉండగా సదాశివ నగర్ మండలం నాలుగో స్థానంలో ఉందన్నారు.

ఈ రెండు మండలాలు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయన్నారు. రైతుల సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా పరిష్కార దృక్పథంతో చూడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నారు. నేను ఎప్పుడూ రైతుల పక్షపాతినేనని అన్నారు. యూరియా కోసం ఏ ఒక్క రైతు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని రైతులకు అవసరమైన యూరియా అందే వరకు నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు.

రైతులకు అవసరమైన ఎరువులను తప్పకుండా అందించడం జరుగుతుందన్నారు. తాడ్వాయి మండలంలో రెండోసారి మొక్కజొన్న కొనుగోలు జరిగే విధంగా కృషి చేయడం జరిగిందని తెలిపారు. జొన్నల కొనుగోలు కేంద్రాల కోసం పోరాడానన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ప్రభుత్వంతో పోరాడడంజరిగిందన్నారు. కొత్త సాంకేతిక విధానాలకు అలవాటు పోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

ఒకప్పుడు ఫోన్ పే ,గూగుల్ పే వంటి డిజిటల్ సేవలు కూడా కొత్తగానే అనిపించాయని నేడు ప్రతి ఒక్కరు వాటిని సునాయాసంగా వినియోగిస్తున్నారని చెప్పారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ను నిర్వహించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందని యాప్ లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందన్నారు. అవసరమైతే రైతులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మరిన్ని మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఎక్కడ యూరియా కొరత లేదని కొన్ని రాజకీయ పార్టీలు యూరియా కొరత ఉందని అసత్య పుకార్రు సృష్టించారని వాటిని రైతులు నమ్మవద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడ యూరియా కొరత లేకుండా గోదాములలో నిలువలు ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో లింగంపేట మండలం కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త కరెంట్ షాక్ తో గాయాలపాలై చికిత్స పొందడంతో అతనిని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పరామర్శించారు. అతనికి వారి కుటుంబ సభ్యులకు మన ధైర్యాన్ని కల్పించారు. త్వరగా కోలుకొవాలని ఆకాంక్షించారు.