23 June, 2026 | 4:58 PM

దేశ సమగ్రత, ఏకత్వం కోసం పోరాడిన మహానేత శ్యామ ప్రసాద్

23-06-2026 03:08 PM

మానకొండూర్ లో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125 వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు

భాజపా ముండలాధ్యక్షులు కంది రాజిరెడ్డి

మానకొండూరు, జూన్ 23 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ మానకొండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయవాది, విద్యావేత్త, దేశభక్తుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125 వ వర్ధంతి సందర్భంగా శ్యామా ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి మంగళవారం ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ మానకొండూరు మండలాధ్యక్షులు కందిరాజిరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ  భారతదేశ సమగ్రత, ఏకత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని ఆయన సేవలను కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపకులలో ఒకరైన ఆయన దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి ఉండాలనే సిద్ధాంతంతో కాశ్మీర్‌లో ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉద్యమించారని తెలిపారు.

"ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానమంత్రులు ఉండరాదు" అనే నినాదంతో దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలని, దేశభక్తి, జాతీయ సమైక్యత కోసం ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. భాజపా మాజీ మండలాధ్యక్షులు, లక్ష్మీపూర్ ఉపసర్పంచ్ రాపాక ప్రవీణ్, మియాపురం లక్ష్మణాచారి, సొన్నాకుల శ్రీనివాస్, వంగల ఆంజనేయులు, బాషబోయిన ప్రదీప్ యాదవ్, శీలం కుమార్, పోచంపల్లి శ్రీనివాస్, ఎదులాపురం అశ్విన్ తేజ,కొల శ్రీనివాస్, తాడూరి కిరణ్ రెడ్డి, నందగిరి బలరాం, ఆరెపల్లి సునంద్, శామంతుల నరేందర్, సాయి,బీజేపీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు.