రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత అంబలి పంపిణీ
05-05-2026 03:42 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): వేసవిలో ప్రజలకు డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కల్గించేందుకు ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్నామని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ అన్నారు. కాసిపేట మండలం కొండాపూర్ యాప దేవాపూర్ గ్రామ పంచాయతీలో కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఆదాని సిమెంట్ కంపెనీ కార్మిక యూనియన్ అధ్యక్షులు, ట్రస్ట్ కోశాధికారి కొక్కిరాల సత్యపాల్ రావు మార్గదర్శకంలో ఉచిత అంబలి పంపిణీ 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ మాట్లాడుతూ... కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ కోశాధికారి సత్యపాల్ రావు ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. రానున్న మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనన్నారు.






