18-02-2026 12:00:00 AM
కోదాడ, ఫిబ్రవరి 17: జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కోదాడ రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో వరుసగా అద్భుతమైన ప్రతిభను కనబరిచి,. ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ బాణాల వసంత రెడ్డి మంగళవారం తెలిపారు. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాలలో అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మెరుగైన స్కోరు సాధించారు.
కళాశాలకు చెందిన ముక్కా చరణ్ సాయి గౌడ్ 99.56 పర్సంటేల్ సాధించాడు.ఈ సందర్భంగా చైర్మన్ బాణాల వసంత రెడ్డి జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఏడాది మా సంస్థ నుండి గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో మరియు జేఈఈ అడ్వానస్డ్ ప్రవేశాలకు అర్హత సాధిస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, ఒత్తిడి లేని వాతావరణంలో కాన్సెప్ట్ ఆధారిత బోధన అందించడం ద్వారా ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల కృషిని, అధ్యాపకుల అంకితభావాన్ని అభినందిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఐఐటీ స్థాయికి చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, సాంబశివరావు, సతీష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఆర్‌ఎస్ విద్యార్థుల ప్రతిభ
కోదాడ, ఫిబ్రవరి 17: తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ ఐ ఐ టీ & మెడికల్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభను కనబరచి మంచి పర్సంటైల్ సాధించినట్లు ఆ అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్యలు మంగళవారం తెలిపారు.
కాలేజ్ కు చెందిన వై. శరణ్య అన్ని విభాగాలలో 93.52 పర్సంటైల్ సాధించినట్లు తెలిపారు. అదే విధంగా మ్యాథ్స్ విభాగంలో కాలేజీ కు చెందిన ఎన్ . యశస్వినిని 98.27, పీ. అమృత సుధా వర్షిణి 97.69 పర్సంటైల్ సాధించినట్లు వారు తెలిపారు. కాలేజ్ కు చెందిన 50 మంది విద్యార్థులకు పైగా 90కి పైగా పర్సంటైల్ సాధించి ఐఐటీ లు, ఎన్ ఐ టీ లలో సీట్లు పొందేందుకు అర్హత సాధించినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ వడ్డే రాజేష్,డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ,అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య,వైస్ ప్రిన్సిపాల్ పీ ఎన్ ఆర్, క్యాంపస్ ఇంచార్జి మౌనిక, పలువురు లెక్చరర్లు అభినందించారు.