30 June, 2026 | 9:40 PM

Breaking News

ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •  

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్

30-06-2026 08:41 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డిఎంహెచ్వో మంగళవారం రోజున పదవి విరమణ పొందిన డాక్టర్స్ ని ఘనంగా సత్కరించడం జరిగింది. అందులో భాగంగా జనరిక్ మందులపై అవగాహన కార్యక్రమం మరియు టీబి ముక్త్ భారత్ జన జాతి అభియాన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

 పదవీ విరమణ పొంది

36 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన ముగ్గురు ఉద్యోగులను డీఎంహెచ్‌ఓ డా. తుకారాం రాథోడ్ ఘనంగా సన్మానించారు. ప్రతి నెల పదవీ విరమణ చేసే వైద్య & ఆరోగ్య శాఖ ఉద్యోగులను జిల్లా కేంద్రంలో సన్మానించే నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారం, మానసిక ప్రశాంతతతో జీవించాలని సూచించారు.

జనరిక్ మందులపై అవగాహన కార్యక్రమం

సమగ్ర అభివృద్ధి వేదిక (SAV) నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల మాదిరిగానే నాణ్యత, భద్రత, ప్రభావం కలిగి ఉంటాయని వివరించారు. వైద్యుల సూచన మేరకే మందులు వాడాలని, స్వయంగా మందులు తీసుకోవద్దని సూచించారు. సమతుల్య ఆహారం, వ్యాయామం, క్రమానుగత ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

టీబీ ముక్త్ జనజాతి అభియాన్ పురోగతి సమీక్ష

గిరిజన ప్రాంతాల్లో టీబీ నిర్మూలన కోసం ఇంటింటి సర్వేలు, యాక్టివ్ కేస్ ఫైండింగ్ (ACF), ఛాతీ ఎక్స్‌రేలు, కఫ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ముందస్తు నిర్ధారణ, పూర్తి చికిత్స, ప్రజల్లో అవగాహన ద్వారా టీబీ రహిత గిరిజన సమాజ నిర్మాణమే లక్ష్యమని డీఎంహెచ్‌ఓ డా. తుకారాం రాథోడ్ తెలిపారు. ప్రభుత్వ శాఖలు, భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేస్తే టీబీ నిర్మూలన లక్ష్యం త్వరగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.