30 June, 2026 | 9:29 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్

30-06-2026 08:35 PM

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి 2026 ఖరీఫ్ సీజన్ రైతు భరోసా పధకాన్ని మంగళవారం లాంచనంగా ఆరంభించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడం కోసం మండల పరిధిలోని పట్వారిగూడెం రైతు వేదికలో లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమానన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎం ఎల్ ఏ జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని రైతులు పట్వారిగూడెం రైతు వేదికలో లైవ్ స్ట్రీమింగ్ లో తిలకించారు.

ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ జారే ఆదినారాయణ మాట్లాడుతూ... అశ్వారావుపేట నియోజకవర్గం లో మొత్తం 48,838మంది రైతులకు రైతు భరోసా రూ. 92 కోట్ల, 77లక్షల, 50వేల 912 వారి బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా జమ అవుతాయని తెలిపారు. ఈ మొత్తాన్ని రైతులు తమ పంట పెట్టుబడికి వాడి వ్యవసాయం లాభసాటి చేసుకోవాలని ఆయన కోరారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, ఏ డి ఏ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి చంద్ర శేఖర్ రెడ్డి, ఏ ఈ ఓ కేశవ రావు తదితరులు పాల్గొన్నారు.