30 June, 2026 | 9:20 PM

Breaking News

క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ

30-06-2026 08:30 PM

యాదగిరిగుట్ట,(విజయకాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకు పూజ (నాగవల్లి దళార్చన) మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణు పుష్కరిణి చెంత ఉన్న ఆంజనేయ స్వామికి సింధూరంతో అలంకరించి, తమలపాకులతో విశేష సహస్రనామార్చనను పండితులు ఘనంగా నిర్వహించారు. కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి నిత్యం కైకర్యాలు  శాస్త్రోక్తంగా  ఘనంగా నిర్వహించారు.

సుప్రభాత సేవ, అభిషేకం, అర్చనతోపాటు నృసింహ హోమం, నిత్య కళ్యాణం ను అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవతో స్వామి అమ్మవార్లను అలంకరించి ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్పటిక లింగం, స్వయంభు లింగానికి అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారి నిత్య రాబడి 18,54,944/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.