30 June, 2026 | 9:51 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రాజకీయ సునామీ

18-02-2026 12:00 AM

బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్

హైదరాబాద్, సిటీబ్యూరో ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయని, బీసీల రాజకీయ చైతన్యానికి ఈ ఫలితాలే సజీవ సాక్ష్యమని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ అభివర్ణించారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాల్లో బీసీలు ఏకంగా 61 శాతం మేర విజయం సాధించి విజయ దుందుభి మోగించడం మారుతున్న రాజకీయ వాతావరణానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

మంగళ వారం హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఫలితాలపై తన విశ్లేషణను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ, దాని ద్వారా వెలువడిన అధికారిక గణాంకాలు బీసీలను రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయని దాసు సురేశ్ పేర్కొన్నారు. తమ జనాభా ఎంత తమకు దక్కుతున్న వాటా ఎంత అనే స్పష్టత రావడం వల్ల బీసీల్లో పెల్లుబికిన చైతన్యం ఓట్ల రూపంలో వెల్లడయ్యిందన్నారు. ఈ సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.