సుడా చైర్మన్‌గా పువ్వాళ్ల
నేడు ప్రమాణ స్వీకారమహోత్సవం
ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్‌లో ఘనంగా ఏర్పాట్లు
హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఖమ్మం, మే 23 (విజయక్రాంతి): స్థంబా ద్రి అర్బన్ డెవలప్ మెంట్ (సుడా) చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇటీవలే అధికారి కంగా ప్రకటన చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లు దుర్గాప్రసాద్‌ను అభినందించారు. పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆదివారం ఖమ్మం ఎస్‌ఆర్ గా ర్డెన్‌లో ఉదయం 11గంటలకు ప్రమాణస్వీకా రం చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు.
డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాగమయి, రాం దాసునాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్, కోరం కనకయ్య, ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావుతో పాటు ఆ శాఖల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్ బాబు పాల్గొంటారని తెలిపారు. ముందుగా ఉదయం 9గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరా వాలని కోరారు.
పువ్వాళ్ల దుర్గాప్రసాద్ రాజకీయ ప్రస్థానం
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తిరుగులేని ప్రజా నాయకుడిగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెనకడుగు వేయకుండా, రెండు పర్యాయాలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నడిపించారు. ప్రతిపక్షంలో ఉన్న కాలంలో ఎన్నో రాజకీయ ఒత్తిడులు, అక్రమ కేసులు, ఇబ్బందులను ఎదుర్కొని కూడా కాంగ్రెస్ జెండాను నిటారుగా ఎగరేశారు. తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న హయాంలో, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క సాధారణ కార్యకర్తకు కొండంత అండగా నిలిచారు.
ఏఐసీసీ, పీసీసీ పిలుపునిచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్నిఖమ్మం జిల్లాలో వంద శాతం విజయవంతం చే శారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ గళాన్ని బలంగా వినిపించారు. జి ల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి డివిజన్‌లోనూ పార్టీ ఉనికిని చాటుతూ, కాంగ్రెస్ క్యాడర్‌ను ఒక తాటిపైకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.
పదవులు ఉన్నా లేకపోయినా నిరం తరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా నాయకుడిగా అందరి హృదయాల్లో స్థానం సంపా దించుకున్నారు. అధిష్ఠానం ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక తిరుగులేని శక్తీగా తీర్చిదిద్దారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా పార్టీలోని అందరినీ కలుపుకొని పోయే సద్గుణం వారిని మరింత ఉన్నతమైన నాయకుడిని చేసింది. పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, పార్టీ పట్ల వారికున్న అచంచలమైన నిష్టను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించి, సుడా చైర్మన్‌గా నియమించింది.






