హుస్నాబాద్ లో భారీ ఎత్తున చోరీ
27-06-2026 07:59 PM
12.5 తులాల బంగారం, 15తులాలు వెండి, రూ.50వేలు నగదు అపహరణ
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ చోరీలు చోటుచేసుకున్నాయి. వడ్డెపల్లి బాలయ్య ఇంట్లోకి చొరబడిన దుండగులు సుమారు 9.5 తులాల బంగారం, 15 తులాల వెండి,రూ.50వేలు అపహరించినట్లు సమాచారం. అలాగే పట్టణంలోని మూడు దుకాణాల్లోనూ చోరీలకు పాల్పడ్డారు. భూపతి ఆంజనేయులు ఇంట్లో రూ.30 వేలు, ఏ2జెడ్ బజార్‌లోనూ రూ.3500 నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా, విచారణలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు కూలీలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. చోరీలకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






