సుందరయ్య జీవితం స్ఫూర్తిదాయకం
19-05-2026 06:27 PM
సిపిఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్
తుంగతుర్తి,(విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వీఎన్ భవనంలో సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో తన గళం వినిపించడంతోపాటు అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం సీపీఎం నాయకులు ముత్తయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.






