విద్యుత్ సరఫరా అంతరాయం
గాలివాన బీభత్సం.. 24 గంటలు విద్యుత్ లేక అవస్థలు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి 15 చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం మండలంలో పలు ప్రాంతాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో గండి మాసానిపేట (గండి మాసానిపేట), కొత్తపల్లి, తిమ్మాపూర్, హాజీపూర్, బాలాజీ నగర్ తదితర గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
విద్యుత్ సరఫరా అంతరాయం.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఎండాకాలం కావడంతో 24 గంటలుగా కరెంటు లేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వేడికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరఫరాకు మోటార్లు నడవక ప్రజల నీటికష్టాలు అన్నీఇన్నీ కావు. మంగళవారం ఉదయం నుంచి ట్రాన్స్‌కో సిబ్బంది పనులను వేగవంతం చేశారు. విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసే పనులు, తెగిన వైర్ల బిగింపు పనులు యుద్ధప్రాతిపదికన జరిగాయి. అకాల వర్షం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, స్థానికంగా విద్యుత్ స్తంభాలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ట్రాన్స్‌కో ఏఈ( Transco ) తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సాయంత్రం లోపు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.






