19 May, 2026 | 7:51 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

ఎట్టకేలకు బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెపూల సత్యనారాయణ నియామకం

19-05-2026 06:23 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎట్టకేలకు మల్లెపూల సత్యనారాయణ రెండవసారి చైర్మన్గా నియమించబడ్డాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల వారీగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు నమ్మిన బంటుగా ఉన్న ఈయనకు పదవిని కట్టబెట్టడంలో మంచిర్యాల ఎమ్మెల్యే కృషి చేసినట్లు సమాచారం.

అంతేగాక డిసిసి అధ్యక్షుని సహకారంతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభ్యర్థి సంపయ్ లేఖలు అందించినట్లు తెలిసింది. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా రెండవసారి నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డికి కట్టబెట్టారు. ఇది ఏమైనా గ్రూపుల వారిగా ప్రయత్నాలు చేసినా కొంతమంది నాయకులు ఆశలు నిరాశ కావడంతో స్థానికంగా చర్చనీ అంశంగా మారింది.