19 May, 2026 | 7:51 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి

19-05-2026 06:36 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ పుచలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య భారత స్వాతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడని కొనియాడారు. నిరాడంబర జీవన విధానంతో ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన ఆదర్శ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.

ఒకసారి రాజ్యసభ సభ్యునిగా, మూడుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటికీ సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. సుందరయ్య ఆశయాల సాధన కోసం పనిచేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అన్నల్దాస్ గణేష్, మండల నాయకులు అన్నల్దాస్ గంగాధర్, సామల నర్సయ్య, అవధూత హరిదాసు, బొద్దుల నరేందర్, కోడం వేణు తదితరులు పాల్గొన్నారు.