19 May, 2026 | 7:50 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి

19-05-2026 06:34 PM

* ఘనంగా సుందరయ్య వర్ధంతి

గరిడేపల్లి,(విజయక్రాంతి): కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరి పోసిన స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధించాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య,సుందరి వీరరాఘవయ్య అన్నారు. మండలంలోని కీతవారిగూడెం, గరిడేపల్లిలో మంగళవారం స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల పక్షాన నిలిచాడు అని అన్నారు. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ తన పేరులో ఉన్న రెడ్డి అనే కులం పేరును తొలగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. దక్షిణ భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.మొదట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.