5 August, 2026 | 1:54 AM

ప్రజా సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

05-08-2026 01:01 AM

బీజేపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి

ఘట్ కేసర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): దేశ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్ సూచనలతో ఘట్కే సర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు సుదర్శన్ రెడ్డి, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, శోభారెడ్డి, జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి, కం భం లక్ష్మారెడ్డి, విప్పర్ల హనుమాన్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉచిత రేషన్, జల్ జీవన్ మిషన్, పీఎం ఆ వాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన, రైతు సంక్షేమ కార్యక్రమాలు, డిజిటల్ ఇండియా వంటి అనేక విప్లవాత్మక పథకాలతో దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంటింటికీ చేర్చి ప్రజల్లో బీజేపీపై మరింత విశ్వాసం పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వమే దేశానికి భరోసా బీజేపీయే తెలంగాణకు ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు పడిగం వీరేశం, గుండ్ల రామతీర్థ గౌడ్, ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్, మంగు రాధిక, కార్యదర్శి సిద్దిరాజు, కోశాధికారి ఎం. నరేష్, యువమోర్చా అధ్యక్షుడు సుర్వి అనిల్ గౌడ్, నాయకులు బండ్లగూడ కిషోర్ గౌడ్, విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.