బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం..
జవహర్‌నగర్, ఆగస్టు 4 (విజయక్రాం తి): కేంద్ర ప్రభుత్వ దగా కోరు పాలనలో జనజీవనం అస్తవ్యస్తమవుతుందని పేపర్ లీకేజీలు కార్మికుల హక్కులను పరిరక్షించ డంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంద ని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు తోటపల్లి శంకర్ దుయ్యబట్టారు. ‘బదలవ్ జురారీ హై‘ కార్యక్రమానికి పురస్కరించు కొని సిపిఐ కాప్రా మండల కార్యదర్శి యా దగిరి ఆధ్వర్యంలో మంగళవారం సిపిఐ మే డ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శం కర్ సమక్షంలో చలో ఢిల్లీ గోడ పత్రికను ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాం తంలో వ్యవసాయం కుంటు పడుతుందని తీవ్ర సంక్షోభంలో రైతులు ఉన్నారని కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపు తేనే దేశంలో మార్పు వస్తుందన్నారు.ఈనెల 6 నుండి పాదయాత్రలు నిర్వహించి బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర సింహ, వెంకటాచారి, స్వరూప్ నాయక్, ఎల్ల య్య, అశోక్ చారి తదితరులు పాల్గొన్నారు.






