ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత.. ప్రజా సంఘాల నేతలు అరెస్ట్
05-03-2026 12:40 PM
- కుమ్మెర ఘటనలో చర్యలు తీసుకోవాలని డిమాండ్
- రోడ్డుపై భైఠాయించిన రజక, ప్రజాసంఘాలు
- ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత
హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) వద్ద ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో(Kummera Mallanna Jatara Row) బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రజక, ప్రజాసంఘాలు అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై భైఠాయించాయి. రహదారిపై భైఠాయించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద పోలీసులకు ప్రజా సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
రాజేంద్రనగర్‌లో ప్లైవుడ్ గోదాం మంటల్లో ఆవిరైపోయిన కోటీ విలువైన ఆస్తి!




